సహస్ర హత్య కేసు ఛేదన!పదో తరగతి విద్యార్థే హంతకుడు
హైదరాబాద్,: కూకట్‌పల్లిని కుదిపేసిన 12 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసుకి ముగింపు లభించింది. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ఎవరో కాదు… పదో తరగతి చదువుతున్న బాలుడేనని పోలీసులు తేల్చారు.
దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలు
- ఆగస్టు 18న మధ్యాహ్నం చోరీ ఉద్దేశంతో సహస్ర ఇంట్లోకి ప్రవేశించాడు బాలుడు.
- బాలిక అడ్డంగా రావడంతో కత్తితో దాడి చేసి హత్య చేశాడు.
- “Mission Dawn” పేరుతో కాగితంపై పూర్తిగా ప్రణాళిక రాసుకున్నాడు.
- ఇంట్లోకి ఎంట్రీ, దొంగతనం, తప్పించుకునే మార్గం అన్నీ ప్లాన్‌లో ఉన్నాయి.
- ఆ చీటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
🚨 కీలక మలుపు
- హత్య జరిగిన రోజు బాలుడు “సహస్ర నాన్నా.. నాన్నా అని అరుపులు వినిపించాయి” అంటూ పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు.
- కానీ పక్కింట్లో వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సాక్ష్యం కీలకం అయింది.
- “నా గది పక్కన బాలుడు 15 నిమిషాలు దాక్కున్నాడు” అని చెప్పడంతో అనుమానాలు బలపడ్డాయి.
🏠 బాలుడి ఇంట్లో లభించినవి
- రక్తంతో తడిసిన దుస్తులు
- హత్యాయుధం కత్తి
- “Mission Dawn” ప్రణాళిక చీటీ
📺 OTT ప్రభావం
వెబ్ సిరీస్‌ల ప్రభావంతోనే ఈ హత్యా ప్రణాళిక సిద్ధం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
- గ్యాస్ లీక్ చేసి తప్పించుకోవాలి అన్న ఆలోచన కూడా ప్లాన్‌లో భాగంగా ఉంది.
👮♂️ పోలీసుల కృషి
- SOT, కూకట్‌పల్లి పోలీసులు కలసి 300 మందిని విచారించారు.
- చివరకు బాలుడే హంతకుడని నిర్ధారణకు వచ్చారు.
- దొంగతనం కోసం ప్రణాళిక వేసి, అడ్డుపడిన సహస్రను హత్య చేశాడని తేల్చారు.
🟥 పోలీసుల మాటల్లో:
“చిన్న వయసులోనే OTT ప్రభావం పడటం విచారకరం.
దొంగతనం కోసం ఆలోచించి, హత్య దాకా వెళ్ళడం సమాజానికి ఆందోళన కలిగిస్తోంది”
Post a Comment