-->

దెయ్యం పట్టినట్లు నటించి భర్తపై దాడి చేసిన భార్య

దెయ్యం పట్టినట్లు నటించి భర్తపై దాడి చేసిన భార్య


ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని వీఎం బంజర్ పంచాయతీ, జంగాల కాలనీలో ఒక విచిత్ర ఘటన చోటు చేసుకుంది. భర్త తరచూ మద్యం తాగి గొడవలు పెట్టడం వల్ల విసిగిపోయిన భార్య లక్ష్మి, దెయ్యం పట్టినట్లు నటించి భర్త గంగారాంపై దాడి చేసింది.

గంగారాం (51)పై కర్ర, ఇనుప రాడ్‌తో దాడి చేసిన ఆమె, నోట్లో గుడ్డలు కుక్కి చితకబాదింది. ఈ ఘటనలో గంగారాం తీవ్రంగా గాయపడగా, పక్కటెముకలు విరిగాయి. స్థానికులు అతన్ని బంధువుల సాయంతో ఆస్పత్రికి తరలించారు.

బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793