మహిళలకు డబుల్ బొనంజా.. పండక్కి రెండు చీరల కానుక!
హైదరాబాద్: తెలంగాణ మహిళలకు ఈసారి బతుకమ్మ పండుగ ఆనందం రెట్టింపు కానుంది. రాబోయే పండుగల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఒక్క చీరను మాత్రమే కానుకగా ఇచ్చిన బతుకమ్మ చీరల పథకాన్ని ఈసారి విస్తరించి, ప్రతి మహిళకు రెండు ఇందిరమ్మ చీరలు అందించనున్నట్లు అధికారిక సమాచారం.
సిరిసిల్ల నేతన్నలకు భారీ ఆర్డర్లు ఈ పథకంలో భాగంగా సిరిసిల్ల నేతన్నలకు 65 లక్షల చీరల తయారీ ఆర్డర్ ఇచ్చారు. దీంతో సుమారు 6 వేలమంది నేతన్నలకు సంవత్సరంతా ఉపాధి లభించే అవకాశం కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇందుకోసం 318 కోట్ల రూపాయలు కేటాయించగా, ఇప్పటికే 30 లక్షల చీరల ఉత్పత్తి పూర్తయింది.
మహిళా పొదుపు సంఘాలకు లాభం ఇందిర మహిళా శక్తి పథకం కింద మహిళా పొదుపు సంఘాలు కూడా భాగస్వామ్యం అవుతున్నాయి. ఈ సంఘాల్లోని ప్రతి మహిళకు ఉచితంగా రెండు చీరలు అందజేయడానికి సిద్ధమవుతోంది ప్రభుత్వం.
నాణ్యతపై దృష్టిగతంలో బీఆర్ఎస్ హయాంలో నాసిరకం చీరలు ఇచ్చారనే విమర్శలు రావడంతో, ఈసారి నాణ్యమైన బట్టతో, ఒక్కో చీర ₹800 విలువ గల చీరలను తయారు చేస్తున్నట్లు చేనేత శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్ తెలిపారు.
👉 గతంలో ఒక చీర మాత్రమే ఇచ్చిన బీఆర్ఎస్‌కు బదులుగా, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు చీరలు అందించబోతోందన్నది ఈ నిర్ణయంలో ముఖ్యాంశం.
Post a Comment