-->

ప్రజా నాయకుడు సాబీర్ పాషాకు పార్టీలో కీలక పదవి

ప్రజా నాయకుడు సాబీర్ పాషాకు పార్టీలో కీలక పదవి


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ పార్టీ కార్యదర్శి, ప్రజానాయకుడు ఎస్.కే. సాబీర్ పాషా మూడవసారి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికై కీలక స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

జిల్లా పార్టీని చాకచక్యంగా నడిపిస్తూ, బలోపేతానికి కృషి చేస్తున్న సాబీర్ పాషా రాష్ట్ర స్థాయిలో కూడా పార్టీకి మరింత సేవలందించాలని ఆకాంక్షలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ మేడ్చల్ జిల్లా గాజులరామవరం వద్ద ఈనెల 20 నుండి 22వ తేదీ వరకు జరిగిన తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభల్లో ఆయనను రాష్ట్ర కార్యవర్గంలో మూడోసారి ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా సీపీఐ 3టౌన్ ఏరియా కార్యదర్శి మహమ్మద్ యూసుఫ్ పూలబొకే అందించి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. సాబీర్ పాషా పేద ప్రజల పక్షాన నిలిచి, వారి సమస్యల సాధన కోసం సమరశీల పోరాటాలు కొనసాగిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని యూసుఫ్ ఆకాంక్షించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793