30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సిఐ, కానిస్టేబుల్
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రక్షకభట నిలయాధికారి & ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భూక్యా రాజేష్, అతని గన్‌మెన్ పోలీస్ కానిస్టేబుల్ ధారావత్ రవి లు లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు.
🔹 వివరాల ప్రకారం –
ఫిర్యాదుదారుని వాహనాన్ని ఒక కేసులో జప్తు చేసి, దాన్ని విడుదల చేసేందుకు మరియు ఆ కేసులో సహకారం అందించేందుకు ₹50,000/- లంచం డిమాండ్ చేయగా, అందులో ₹30,000/- స్వీకరిస్తూ నేరస్థులుగా పట్టుబడ్డారు.
⚠️ ప్రజలకు సూచన:
ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినా వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖను సంప్రదించండి.
📞 టోల్ ఫ్రీ నెంబర్: 1064
📱 WhatsApp: 9440446106
📘 Facebook: Telangana ACB
🐦 X (Twitter): @TelanganaACB
🌐 Website: acb.telangana.gov.in
👉 ఫిర్యాదుదారుల/బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి.
Post a Comment