-->

గర్భవతి భార్యను ముక్కలు చేసిన భర్త అరెస్ట్

గర్భవతి భార్యను ముక్కలు చేసిన భర్త అరెస్ట్


హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీ హిల్స్ కాలనీలో ఓ భర్త తన భార్యను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసిన సంఘటన చోటుచేసుకుంది.

గర్భవతిగా ఉన్న భార్య స్వాతిని ఆమె భర్త మహేందర్ రెడ్డి దారుణంగా నరికి, మృతదేహ భాగాలను కవర్లలో పెట్టి బయట పడేయడానికి యత్నించాడు. అయితే గదిలోనుంచి అనుమానాస్పద శబ్దాలు రావడంతో పొరుగువారు వెళ్లి చూడటంతో ఘటన బహిర్గతమైంది.

వెంటనే పోలీసులు సమాచారం అందుకొని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. స్వాతి వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందినది కాగా, ప్రేమ వివాహం చేసుకొని భర్తతో బోడుప్పల్లో నివాసం ఉంటున్నట్లు తెలిసింది.

ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు హత్య వెనుక గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793