-->

హెచ్ఎంఎస్ గౌరవాధ్యక్షురాలిగా కవిత 31న ఏకగ్రీవంగా ఎన్నుకోనున్న సంఘం నేతలు

హెచ్ఎంఎస్ గౌరవాధ్యక్షురాలిగా కవిత 31న ఏకగ్రీవంగా ఎన్నుకోనున్న సంఘం నేతలు


మంచిర్యాల: సింగరేణి కార్మిక సంఘాల పరిణామాల్లో మరో మలుపు తిరిగింది. ఇటీవల టీబీజీకేఎస్​ గౌరవాధ్యక్షురాలిగా కవిత స్థానంలో కొప్పుల ఈశ్వర్​ను నియమించిన విషయం తెలిసిందే.

తాజాగా హిందూస్తాన్ మజ్దూర్ సభ (హెచ్ఎంఎస్​) గౌరవాధ్యక్షురాలిగా కవితను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఈ నెల 31న మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో జరగనున్న జనరల్ బాడీ సమావేశంలో ఆమెను ఎన్నుకునే అవకాశం ఉందని హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్ ప్రకటించారు.

టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న కాలంలో సింగరేణి కార్మికుల కోసం కవిత చేసిన కృషిని పరిగణనలోకి తీసుకుని, ఆమెను మళ్లీ ముఖ్య భాద్యతలతో ముందుకు తేవాలని సంఘం నిర్ణయించిందని నేతలు తెలిపారు.

ఇక ఇటీవలే హైదరాబాద్‌లోని కవిత నివాసంలో సింగరేణి జాగృతి, హెచ్ఎంఎస్ నాయకులు సమావేశమై ఈ విషయంపై చర్చించారని సమాచారం.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793