-->

కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో 12 కోట్ల కాష్.. ఈడీ దాడుల్లో సంచలనం!

 

కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో 12 కోట్ల కాష్.. ఈడీ దాడుల్లో సంచలనం!

బెంగళూరు/ కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర అవినీతి ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాల్లో సంచలన అంశాలు బయటపడ్డాయి.

🔹 12 కోట్లు కరెన్సీ (ముఖ్యంగా ₹500 నోట్ల కట్టలు)
🔹 6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు
🔹 10 కేజీల వెండి
🔹 నాలుగు లగ్జరీ కార్లు
🔹 ఒక కోటి రూపాయల ఫారెన్ కరెన్సీ

అన్నీ ఈడీ అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం.

ఇల్లీగల్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్ కేసులో ఎమ్మెల్యే వీరేంద్ర నేరుగా ఇన్వాల్వ్ అయ్యినట్లు దర్యాప్తులో తేలింది. సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో ఆయనను అరెస్ట్ చేసి, అక్కడి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.

అదే కాకుండా, వీరేంద్ర సన్నిహితుల ఇళ్లలో దర్యాప్తులో 17 బ్యాంకు అకౌంట్లు, రెండు లాకర్లు కూడా ఫ్రీజ్ చేసినట్లు ఈడీ తెలిపింది. ఎమ్మెల్యే సోదరుడు కేసీ నాగరాజ్‌, అతని కొడుకు ఎన్. రాజ్ పేర్లపై ఉన్న అక్రమ ఆస్తుల డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు.

🔎 ఆన్‌లైన్ గేమింగ్ వ్యాపారం

  • కింగ్ 567, రాజా 567, పప్పీస్ 003, రత్న గేమింగ్ పేర్లతో సైట్లను నడిపినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.
  • దుబాయ్‌లో ఎమ్మెల్యే సోదరుడు కేసీ తిప్పేస్వామి ఆధ్వర్యంలో డైమండ్ సాఫ్టెక్, TRS టెక్నాలజీస్, ప్రైమ్ 9 టెక్నాలజీస్ పేర్లతో కాల్‌సెంటర్లు నడుస్తున్నాయి. ఇవన్నీ బెట్టింగ్, గేమింగ్ కార్యకలాపాలకు సంబంధించినవేనని అధికారులు గుర్తించారు.

👉 అంతేకాకుండా గోవాలో ఎమ్మెల్యే వీరేంద్రకు ఐదు క్యాసినోలు ఉన్నాయన్న విషయం కూడా బయటపడటంతో కేసు మరింత హై ప్రొఫైల్‌గా మారింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793