హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్‌పై ఆరోపణలు నిరాధారం
హెచ్ఎంఎస్ అనుబంధ సింగరేణి మైనర్స్ యూనియన్
హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ గారిపై జక్కుల నారాయణ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఖండించింది.
సభ్యత్వం లేని నారాయణకు రియాజ్ అహ్మద్ గారిని బహిష్కరించే హక్కు లేదని యూనియన్ స్పష్టం చేసింది. తడకల దొంగతనం కేసులో డిస్మిస్ అయిన నారాయణకు హెచ్ఎంఎస్ కృషి వల్లే తిరిగి ఉద్యోగం లభించిందని, ఇప్పుడు ఆయన కార్మిక వ్యతిరేక శక్తుల ప్రేరణతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించింది.
తాజాగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు హెచ్ఎంఎస్‌తో కలిసి కార్మికుల కోసం పోరాటానికి ముందుకు రావడంతో, కొంతమంది శక్తులు జీర్ణించుకోలేక నారాయణను ఉపయోగిస్తున్నారని యూనియన్ ఆరోపించింది.
హెచ్ఎంఎస్ ఎల్లప్పుడూ నిజాయితీగా కార్మికుల పక్షాన పోరాడుతుందని, రియాజ్ అహ్మద్ గారిపై తప్పుడు ఆరోపణలు చేస్తే కార్మిక వర్గం తగిన సమాధానం చెబుతుందని హెచ్చరించింది.
Post a Comment