నారి మహిళా ఆరోగ్య సంకల్పం – రాజీవ్ గాంధీ జయంత ప్రత్యేక కార్యక్రమం
భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా “నారి మహిళా ఆరోగ్య సంకల్పం” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు ఆల్కా లంబా పిలుపు మేరకు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ఆదేశాల ప్రకారం మహిళల ఆరోగ్యం, బాలికల రక్షణ దృష్ట్యా ఈ కార్యక్రమంలో ఉచిత శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేపట్టబడింది.
జిల్లాలోని చుంచుపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, లక్ష్మీదేవిపల్లి మండల పాలకేంద్రంలోని పాఠశాలలు, అలాగే కొన్ని స్లం ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆధ్వర్యంలో బాలికలకు శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, కార్యకర్తలు, అలాగే INTC నాయకులు రజాక్, సుజాతనగర్ మండల అధ్యక్షులు చింతలపూడి శేకర్, మాజీ కౌన్సిలర్ కనుకుట్ల శ్రీను, యూత్ కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ రెడ్డి, మాజీ MPTC నాగరాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే మహిళా కాంగ్రెస్ జిల్లా, బ్లాక్, టౌన్, మండల స్థాయి అధ్యక్షులు, కార్యదర్శులు, జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా బండ్ల రజనీ, పొదిలి జ్యోతి, బోడ దివ్య, గుగులోతు కమలమ్మ, పందాల సరిత, బర్ల నాగమణి, బూరుగుపల్లి పద్మశ్రీ, సున్నం లక్ష్మి, మచ్చల పార్వతి, కొల్లు పద్మ, గాలిపల్లి స్వరూప, కూరపాటి సౌజన్య, గుగులోతు ప్రియాంక, బడుగు కృష్ణవేణి, వసంతాల రాజేశ్వరి, వేముల రాజ్యలక్ష్మి, గుర్రం జయసుధ, జయమ్మ, జయ, అరుణ, భవాని, విద్య తదితరులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ నాయకులు మహిళల ఆరోగ్య పరిరక్షణకు నిరంతర కృషి చేస్తామని, ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుందని తెలిపారు.

Post a Comment