ఉస్మానియా యూనివర్సిటీ వార్షిక స్నాతకోత్సవంలో వై. శారదకు పీహెచ్‌డీ పట్టా
రంగారెడ్డి జిల్లా, కందుకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ అధ్యాపకురాలిగా పనిచేస్తున్న శ్రీమతి వై. శారద గారు, హిందీ సాహిత్యంలో చేసిన పరిశోధనకు గాను ఉస్మానియా యూనివర్సిటీ నుండి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ 84వ వార్షిక స్నాతకోత్సవం ఆగస్టు 19, 2025న ఠాగూర్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు ఉస్మానియా యూనివర్సిటీ ఛాన్సెలర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ హాజరై, విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం తో కలిసి విద్యార్థులకు డిగ్రీలు, పతకాలు మరియు బహుమతులను ప్రదానం చేశారు.
అనంతరం వివిధ రంగాల్లో పరిశోధన చేసిన వారికి పీహెచ్‌డీ పట్టాలు అందజేశారు. ఆ సందర్భంగా శ్రీమతి వై. శారద గారు, ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ మరియు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం చేతుల మీదుగా పీహెచ్‌డీ పట్టా స్వీకరించారు.

Post a Comment