-->

ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఘన నివాళి

 

ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఘన నివాళి

తెలంగాణ రాష్ట్ర సాధనే తన జీవిత లక్ష్యంగా పెట్టుకుని ఉద్యమమే ఊపిరిగా జీవించిన తెలంగాణ ఆత్మగా నిలిచిన ప్రొఫెసర్ కె.జయశంకర్ జయంతిని పురస్కరించుకుని, ఢిల్లీలో ఘనంగా నివాళులు అర్పించారు బీఆర్ఎస్ నేతలు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)తో పాటు, రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, బూరనపల్లి దామోదర్ రావు, పార్ధసారధి రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తదితరులు ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, “తెలంగాణ ఆత్మగౌరవ ఉద్యమానికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ తీసుకున్న ఉద్యమ మార్గదర్శనం ఎంతో విశిష్టమైనది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఆయన ప్రేరణగా నిలిచారు. యువతకు ఆయన ఆశయాలు దిశానిర్దేశం చేయాలి” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు.

Blogger ఆధారితం.