-->

గచ్చిబౌలిలో డ్రగ్స్ పోలీసులు ఆకస్మిక దాడి పలువురిని అరెస్ట్ చేశారు

గచ్చిబౌలిలో డ్రగ్స్ పోలీసులు ఆకస్మిక దాడి పలువురిని అరెస్ట్ చేశారు


హైదరాబాద్‌: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. గచ్చిబౌలిలో గోప్య సమాచారం ఆధారంగా పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రమంలో రాజమండ్రి డిప్యూటీ తహశీల్దార్ మణిదీప్, అమెరికా నుండి వచ్చిన నీలిమ, మరో ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 20 గ్రాముల కొకైన్, నాలుగు గ్రాముల MDMA, 20 NTC మాత్రలు స్వాధీనం చేసుకున్నారు.

ప్రాథమిక విచారణలో, డ్రగ్స్‌ను బెంగళూరు నుండి తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కేసులో ప్రధాన నిందితుడు విక్రమ్‌ను డిచ్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు.

డ్రగ్స్ కేసులు వరుసగా వెలుగులోకి వస్తుండటంతో హైదరాబాద్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది. యువతను ఈ మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793