25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కొత్తగూడెం వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో ఫిర్యాదుదారుని దుకాణంలో సరైన ఇన్వాయిస్ లేకుండా యూరియా సంచులను విక్రయించిన కేసులో చర్యలు తీసుకోకుండా అధికార సహాయం అందించేందుకు రూ.25,000/- లంచం స్వీకరిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్ ఉల్లోజు నర్సింహారావు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు.
ప్రజలకు హెచ్చరికగా అవినీతి నిరోధక శాఖ సూచించింది:
➡️ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కి డయల్ చేయాలి.
➡️ అదేవిధంగా WhatsApp (9440446106), Facebook (Telangana ACB), X (@TelanganaACB), Website (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.
🔒 ఫిర్యాదుదారుల / బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

Post a Comment