బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కోసం మోదీని గద్దె దింపే వరకు పోరాటం : టీపీసీసీ నేత నాగా సీతారాములు
న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో జరిగిన ధర్నాలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తేల్చకుండా కేంద్రం నైపుణ్యంతో ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. ఈ విషయాన్ని తేల్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించే స్థాయిలో పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.
ఈ ధర్నాలో ఉమ్మడి జిల్లాల నుండి వచ్చిన టీపీసీసీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకు బీసీ వర్గాలు విపరీతంగా మద్దతు ఇస్తున్నాయి. బీసీలకు న్యాయం జరిగేంత వరకు మేము ఊరుకోం. బీజేపీ మత రాజకీయాలతో బీసీలకు వచ్చే హక్కులను అడ్డుకుంటోంది. బీఆర్‌ఎస్ పార్టీ కూడా బీసీల విషయంలో మౌనంగా వ్యవహరిస్తోంది. ఈ రెండు పార్టీలకు బీసీల బలాన్ని ఈ ధర్నా చూపించింది’’ అన్నారు.
రాజకీయ లబ్దిపురస్కారాల కోసమే బీసీలకు రావలసిన 42 శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్రం అమలు చేయడంలో నిర్లక్ష్యం చూపుతోందని, నాలుగు నెలల క్రితమే కేంద్రానికి పంపిన బిల్లుపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు.
‘‘బీసీల హక్కుల కోసం చివరి శ్వాస వరకు పోరాడతాం. అవసరమైతే మోదీని గద్దె దింపే స్థాయికి పోతాం’’ అంటూ నాగా సీతారాములు తేల్చిచెప్పారు.
Post a Comment