-->

చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో సందడి.. టీపీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ ఇంచార్జ్ రైల్లో ప్రయాణానికి సిద్ధం..!

చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో సందడి.. టీపీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ ఇంచార్జ్ రైల్లో ప్రయాణానికి సిద్ధం..!


హైదరాబాద్‌, తెలంగాణ రాజకీయాల్లో వేడి పెరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుల రైలు ప్రయాణం వార్తల్లోకి ఎక్కింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఈరోజు చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ వేచి ఉన్న పార్టీ కార్యకర్తలు, నాయకులు వీరికి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా నాయకులు ప్రజలతో మమేకమవుతూ తమ పాదయాత్రల అనంతర ప్రయాణాన్ని రైలు ద్వారా కొనసాగించనున్నారు. నాగపూర్‌ వరకు రైల్లో ప్రయాణించనున్న వారు, అక్కడి నుండి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌లు కలిసి ప్రయాణించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ రైలు ప్రయాణం ద్వారా నేతలు పార్టీ శ్రేణులకు, ప్రజలకు దగ్గరవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా పోటీ చేయనున్నట్టు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఇదే తరహాలో పాదయాత్రలు, ప్రజల మద్యకూ రైలు ప్రయాణాలతో కలిసిమెలిసి ప్రజలతో మమేకమవుతూ నేతలు ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తన పునరుజ్జీవనాన్ని ఈ చర్యలతో నిరూపించేందుకు సిద్ధంగా కనిపిస్తోంది.

Blogger ఆధారితం.