-->

వరదలో జీఆర్ కాలోని మునిగిపోయిన గ్రౌండ్ ఫ్లోర్.. కాపాడాలంటూ వేడుకోలు

వరదలో జీఆర్ కాలోని మునిగిపోయిన గ్రౌండ్ ఫ్లోర్.. కాపాడాలంటూ వేడుకోలు


కామారెడ్డి: ఆగస్టు 27: కామారెడ్డి జిల్లాలో వరదలు ప్రమాదకరంగా మారుతున్నాయి. నిరంతర వర్షాల కారణంగా పట్టణంలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జీఆర్ కాలనీ తీవ్రంగా ప్రభావితమై, అక్కడి ఓ భవనం గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. ఆ భవనంలో చిక్కుకున్న వారిని కాపాడాలని స్థానికులు ఆర్తనాదాలు చేస్తున్నారు.

ఇక నాగిరెడ్డిపేట మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో విద్యార్థులు కూడా వరద జలాల్లో ఇరుక్కుపోయారు. వెంటనే స్థానికులు, అధికారులతో కలిసి రక్షణ చర్యలు చేపట్టారు. అందులోని విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

అదేవిధంగా మెదక్ జిల్లా రామాయంపేటలోని మహిళా డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో సుమారు 300 మంది విద్యార్థులు వరదల్లో ఇరుక్కుపోయిన ఘటన చోటు చేసుకుంది. అధికారులు, సిబ్బంది సమన్వయంతో వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు రక్షణ చర్యలను వేగవంతం చేయాలని అధికారులను కోరుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793