-->

బెజ్జూరులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కలపత్రాల విడుదల


ఆగస్టు 9న ఘనంగా వేడుకలు నిర్వహించాలని పిలుపు

కొమురం భీం జిల్లా, బెజ్జూర్ మండల కేంద్రంలోని ఆదివాసీ భవనంలో ఈరోజు మండల మెడి కొడప శంకర్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ (ఆగస్టు 9) సందర్భంగా కలపత్రాలను రాష్ట్ర, జిల్లా నాయకుల సమక్షంలో విడుదల చేశారు.

ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ — “ఆగస్టు 9 ఆదివాసుల ప్రత్యేక దినం. ఈరోజు ప్రతి గ్రామంలో కోయ, కొలవార్, పర్ధాన్ తెగల ప్రజలు తమ సాంప్రదాయ పద్ధతుల్లో వేడుకలు జరుపుకోవాలి. అనంతరం బెజ్జూర్ మండల కేంద్రంలో నిర్వహించే భారీ స్థాయి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలి” అని పిలుపునిచ్చారు.

ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ ప్రపంచానికి చాటి చెప్పడం, ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవడమే లక్ష్యమని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు: రాజ్ గొండ్ సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెందోర్ సుధాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొడప విశ్వేశ్వర్ రావు, గోండ్ వాన పంచాయతీ రాయి సెంటర్ జిల్లా మెడి కుర్సింగ మోతిరం మరియు బృందం, బెజ్జూర్ మరియు పెంచికల్‌పేట్ సార్ మెడిలు, కొలవార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆత్రం భక్కయ, కొలవార్ సంఘ నాయకులు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు పోర్తేటీ శ్రీదేవి, మహిళా సంఘం అధ్యక్షురాలు ఏనుక అమృత, తుడుం దెబ్బ నాయకులు, ఆదివాసీ సర్పంచులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

Blogger ఆధారితం.