-->

మానేరు డ్యామ్‌లో అరుదైన భారీ చేప..!

 

మానేరు డ్యామ్‌లో అరుదైన భారీ చేప..!

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ సంగంపల్లి గ్రామానికి చెందిన జాలరి కూన సంపత్ ప్రతిరోజూ ఎల్ఎండి మానేరు డ్యామ్‌లో వల వేసి చేపలు పట్టుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. సాధారణంగా చిన్న చిన్న చేపలే పడుతున్నాయి. కానీ ఈసారి మాత్రం అప్రతీక్షిత సర్ప్రైజ్ ఎదురైంది.

వల లాగేందుకు ప్రయత్నిస్తుండగా అది కదల్లేదు. ఎంత ప్రయత్నించినా పైకి రాలేదు. చివరకు తీవ్ర శ్రమతో వల బయటకు తీసిన సంపత్‌కి పెద్ద షాక్‌ ఎదురైంది. వలలో దాదాపు 25 కిలోల బరువు ఉన్న భారీ బొచ్చే చేప చిక్కింది.

ఇంత పెద్ద చేపను చూసి సంపత్ ఆశ్చర్యానికి గురయ్యాడు. మరో వ్యక్తి సహాయంతో వల నుంచి చేపను బయటకు తీశారు. ఈ వార్త గ్రామంలో అడుగుపెట్టగానే స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని చేపను చూసి మురిసిపోయారు.

"ఇంత భారీ చేప ఎప్పుడూ వలలో చిక్కలేదు" అని సంపత్ చెబుతున్నాడు. ఈ అరుదైన చేపను కొనుగోలు చేయడానికి పలువురు ఆసక్తి చూపుతున్నారు.

👉 మత్స్యకారుడి అదృష్ట వేట స్థానికుల మధ్య చర్చనీయాంశంగా మారింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793