-->

HMS 26వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి

30, 31 తేదీల్లో శ్రీరాంపూర్ ఏరియాలో గోదావరి పరిరక్షణ పంక్షన్ హల్‌లో జరుగనున్నాయి


మణుగూరు: సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ (HMS) 26వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 30, 31 తేదీల్లో శ్రీరాంపూర్ ఏరియాలో గోదావరి పరిరక్షణ పంక్షన్ హల్‌లో జరుగనున్నాయి. ఈ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ మణుగూరు HMS ఉపాధ్యక్షురాలు కోడిపల్లి శ్రీలత, జేబీసీసీఐ మెంబర్, HMS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మణుగూరు HMS యూనియన్ కార్యాలయంలో 26వ రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కోడిపల్లి శ్రీలత మాట్లాడుతూ –“కార్మికుల ఆత్మగౌరవం, హక్కుల సాధన, సంస్థ పరిరక్షణ మా ప్రథమ కర్తవ్యం. కార్మికుల కల అయిన సొంత ఇల్లు, కొత్త భూగర్భ గనుల ప్రారంభం, పరుగు పందెం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు, కార్మికులకు సౌకర్యాల కల్పన, ఇన్కమ్ టాక్స్ రద్దు, పాత VRS స్కీమ్ పునరుద్ధరణ – ఇవన్నీ HMS ప్రధాన లక్ష్యాలు” అని పేర్కొన్నారు.

అలాగే “అనునిత్యం కార్మికుల కోసం, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న ఏకైక యూనియన్ HMS యూనియన్” అని ఆమె స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో HMS జెనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్ గారు, వైస్ ప్రెసిడెంట్ కోడిపల్లి శ్రీలత, రకీబ్, సంజీవ్ కుమార్, షబ్బీర్ పాషా, రమేష్, జానీ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793