-->

చెల్పూర్ KTPPలో కొత్త సమావేశ మందిరం ప్రారంభం

చెల్పూర్ KTPPలో కొత్త సమావేశ మందిరం ప్రారంభం


జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్‌లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (KTPP) పరిధిలో కొత్త హంగులతో నిర్మించిన సర్వీస్ బిల్డింగ్ 3వ అంతస్తులోని సమావేశ మందిరాన్ని చీఫ్ ఇంజనీర్ (ఓం & ఎం) చిట్టాప్రగడ శ్రీ ప్రకాష్ గారు ఈ రోజు ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి, సమావేశ మందిరాన్ని సందర్శించిన చీఫ్ ఇంజనీర్ గారు, కార్యాలయాల మౌలిక వసతుల అభివృద్ధిపై శ్రద్ధ తీసుకోవడం గొప్ప విషయం అని అన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఓం & ఎం విభాగం, అర్టీజన్ విభాగానికి చెందిన సూపరింటెండెంట్ ఇంజనీర్లు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సమావేశ మందిరం ఆధునిక హంగులతో, విస్తృతమైన ప్రదేశంతో సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు, అధికార సమావేశాల నిర్వహణకు ఉపయోగపడనుందని అధికారులు తెలిపారు.

Blogger ఆధారితం.