-->

హత్య కేసులో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష రూ.1,000 జరిమానా

హత్య కేసులో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష రూ.1,000 జరిమానా


కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మంగళవారం ఒక హత్య కేసులో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

కేసు వివరాలు:
2022 అక్టోబర్ 24న రాత్రి 7.50 గంటలకు కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ టెంపుల్ ప్రాంతంలో జరిగిన ఘటనలో, బడికెల సంతోష్ కుమార్ @ బాబీపై పళ్లెం సాయికుమార్ @ జగడం సాయి దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. తలపై సిమెంటు ఇటుకతో కొట్టడంతో సంతోష్ కుమార్ గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఈ ఘటనపై బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ పోలీసులు అప్పటి సీఐ కె. అబ్బయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. అనంతరం నిందితుడిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

కోర్టులో 15 మంది సాక్షులను విచారించిన అనంతరం, నిందితుడు పళ్లెం సాయికుమార్ నేరం నిరూపితమై శిక్ష విధించారు.

విచారణలో పాత్రధారులు:

  • ప్రస్తుత త్రీ టౌన్ ఇన్స్పెక్టర్: శివప్రసాద్
  • పబ్లిక్ ప్రాసిక్యూటర్: పి.వి.డి. లక్ష్మీ
  • కోర్ట్ లైజన్ ఆఫీసర్: ఎన్. వీరబాబు
  • కోర్ట్ పిసి: హేమీ లాల్
Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793