జాతీయ ఇంజినీర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా జరుపుకునే జాతీయ ఇంజినీర్ల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ఇంజనీర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
దేశ ప్రగతిలో ఇంజనీర్ల పాత్ర అపూర్వమని, వారి సృజనాత్మక ఆవిష్కరణలే జాతి అభివృద్ధికి మార్గదర్శకమని సీఎం గుర్తుచేశారు.
“ఇంజినీరుగా, దార్శనికుడిగా, విద్యా ప్రదాతగా, పారిశ్రామిక ప్రగతి చోదకుడిగా విశ్వేశ్వరయ్య గారు ప్రత్యేకతను చాటారు. అత్యుత్తమ సాంకేతికతతో అనేక రంగాల్లో చేసిన కృషి భారత ఇంజనీరింగ్‌కు ఆదర్శప్రాయంగా నిలిచింది” అని సీఎం పేర్కొన్నారు.
మూసీ వరదల నుంచి హైదరాబాద్‌ను రక్షించే జల నియంత్రణ ప్రణాళికలు, ఎన్నో విశిష్ట నిర్మాణాలు ఆయన ప్రతిభకు నిదర్శనమని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.

Post a Comment