-->

నకిలీ ఆర్టీఏ అధికారుల అరెస్ట్ – ఖమ్మంలో దోపిడీ ముఠాకు చెక్

నకిలీ ఆర్టీఏ అధికారుల అరెస్ట్ – ఖమ్మంలో దోపిడీ ముఠాకు చెక్


ఖమ్మం రూరల్ మండలంలో నకిలీ ఆర్టీఏ అధికారులుగా చలామణి అవుతూ వాహనాలను ఆపి దోపిడీకి పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ ముష్కరాజ్ వెల్లడించారు.

గత కొద్ది రోజులుగా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కత్తుల మోహన్, ఏదులాపురం మున్సిపాలిటీ వరంగల్ క్రాస్ రోడ్డుకు చెందిన ఆత్కూరి నవీన్, కూసుమంచి మండలం బోడియ తండాకు చెందిన జాటోత్ సాగర్, ఆదిలాపురం మున్సిపాలిటీ భారీ కూడానికి చెందిన దంతాల వెంకట్ నారాయణ ముఠాగా ఏర్పడి ఆర్టీఏ అధికారులుగా వేషధారణ చేసి జాతీయ రహదారిపై వాహనదారులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సూర్యాపేట జిల్లా శ్రీశైలం అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు జరిపి ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం కేసు నమోదు చేసి ఖమ్మం జైలుకు తరలించారు.

ఇంతకుముందు కూడా ఈ ముఠా సభ్యులు తిరుమలయపాలెం మండలంలోని ఓ హోటల్ నిర్వాహకుడిని బెదిరించి రూ.8 వేల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

👉 పోలీసులు హెచ్చరిక: జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తూ అనుమానాస్పదంగా ప్రవర్తించే వ్యక్తులను వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని రూరల్ ఎస్‌హెచ్ఓ ముష్కరాజ్ ప్రజలకు సూచించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793