-->

ఉత్తమ అధ్యాపకుల అవార్డులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!!

 

ఉత్తమ అధ్యాపకుల అవార్డులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!!

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలు, అనుబంధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విశిష్ట సేవలు అందిస్తున్న అధ్యాపకులను తెలంగాణ ప్రభుత్వం సత్కరించనుంది. ఈ మేరకు ఉత్తమ అధ్యాపకుల అవార్డుల జాబితాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి యోగితా రాణా గురువారం విడుదల చేశారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి నలుగురు అధ్యాపకులు ఎంపికయ్యారు. కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ, డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ వర్సిటీల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎంపికయ్యారు.

వీరితోపాటు రాష్ట్రంలోని అనుబంధ డిగ్రీ కళాశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న పలువురు అధ్యాపకులు కూడా అవార్డులకు ఎంపికయ్యారని ప్రభుత్వం స్పష్టం చేసింది.

🎖️ ఉత్తమ బోధన, పరిశోధన, విద్యార్థుల ప్రోత్సాహం, అకడమిక్ సేవల ఆధారంగా ఎంపిక చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793