-->

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే బీఆర్‌ఎస్ విమర్శలు: మంత్రి సీతక్క

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే బీఆర్‌ఎస్ విమర్శలు: మంత్రి సీతక్క


ఖమ్మం, వైరా: వైరా మున్సిపాలిటీలో పర్యటించిన రాష్ట్ర మంత్రి సీతక్క మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం, అభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే భారత రాష్ట్ర సమితి పార్టీ విమర్శలు చేస్తున్నదని ఆమె అన్నారు.

రైతులకు యూరియ సరఫరా చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమని, అయితే రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలుచేసిందని ఆమె ఎద్దేవా చేశారు.

భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపడతామని హామీ ఇచ్చిన సీతక్క, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కల్పించనున్నట్లు తెలిపారు. మహిళల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.

అలాగే, రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793