చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో మహిళ మృతదేహం కేసులో కీలక పురోగతి
చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో మహిళ మృతదేహం కేసులో కీలక పురోగతి
హైదరాబాద్: సెప్టెంబర్ 20: చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సంచిలో లభించిన మహిళ మృతదేహం కేసులో పోలీసులు గణనీయమైన పురోగతి సాధించారు. సెప్టెంబర్ 15 ఉదయం ఓ వ్యక్తి ఆటోలో తీసుకువచ్చి గోడ పక్కన పడేసిన మృతదేహం పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రమీలదేనని పోలీసులు గుర్తించారు.
భర్తతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న ప్రమీల, హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో తన రాష్ట్రానికి చెందిన మరో యువకుడితో నివసిస్తోందని విచారణలో తేలింది. వారిద్దరి మధ్య తలెత్తిన గొడవలతో ఆ యువకుడు ఆమెను హత్య చేసి, శవాన్ని సంచిలో పెట్టి ఆటోలో చర్లపల్లికి తీసుకెళ్లి పడేశాడు. అనంతరం రైల్వే స్టేషన్‌లో బట్టలు మార్చుకుని, అస్సాంలోకి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Post a Comment