-->

రాష్ట్రంలో 11 జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక – ఎల్లో అలర్ట్ జారీ

రాష్ట్రంలో 11 జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక – ఎల్లో అలర్ట్ జారీ

రాష్ట్రంలో 11 జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక – ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాల బీభత్సం కొనసాగుతోంది. వాతావరణ శాఖ తాజా హెచ్చరిక ప్రకారం సోమవారం నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఆదివారం మహబూబాబాద్, సూర్యాపేట, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. జనగాం, యాదాద్రి జిల్లాల్లో 11 సెంటీమీటర్లు, హైదరాబాద్ హయత్ నగర్‌లో 8.5 సెంటీమీటర్లు, కాప్రా, ఉప్పల్, నాగోల్, మల్కాజ్ గిరి ప్రాంతాల్లో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేడుకలకు అంతరాయం కలిగింది. వాతావరణ శాఖ ప్రకారం రానున్న రోజుల్లో కూడా ఇలాంటి వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పగలు ఎండ, ఉక్కపోత ఎక్కువగా ఉంటుండగా, సాయంత్రం నుంచి రాత్రివరకు భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793