మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం పర్యటన ఉన్నందున మంత్రి సీతక్క పర్యటన
మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం పర్యటన ఉన్నందున మంత్రి సీతక్క పర్యటన
ములుగు జిల్లా: సెప్టెంబర్ 22: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ముందుగా పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమం, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క సోమవారం మేడారంలో అభివృద్ధి పనులను పరిశీలించారు.
తాడ్వాయిలోని సమ్మక్క–సారలమ్మ తల్లులను మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్, ఎస్పీ షబరిష్‌లతో కలిసి దర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు దేవాలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో పర్యాటక, అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష జరిపారు.
అధికారులకు పలు సూచనలు, మార్గదర్శకాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) సి.హెచ్. మహేందర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆర్‌డీఓ వెంకటేష్, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గరావు, ఈఓ వీరస్వామి, ఏపీవో వసంతరావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment