అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం సోదర హత్య కలకలం
అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం సోదర హత్య కలకలం
ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిరుతపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం రక్తపాతం దాకా వెళ్లింది.
చిరుతపల్లి గ్రామానికి చెందిన మాధవరావు (35), అతని తమ్ముడు సాంబశివరావు మధ్య కొంతకాలంగా ఆస్తి విషయంపై విభేదాలు కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రంగా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన సాంబశివరావు ఇంట్లో ఉన్న గడ్డపారతో మాధవరావు తలపై బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలతో మాధవరావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగగా, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హత్య అనంతరం తమ్ముడు సాంబశివరావే స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Post a Comment