కొబ్బరి బోండాల డీసీఎం బోల్తా ఎగబడి వాటిని దోచుకెల్లిన జనం !
కొబ్బరి బోండాల డీసీఎం బోల్తా ఎగబడి వాటిని దోచుకెల్లిన జనం !
సూర్యాపేట, సెప్టెంబర్ 22: ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కొబ్బరి బోండాలతో నిండిన డీసీఎం వాహనం సూర్యాపేట జిల్లా రాయినిగూడెం వద్ద బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో వాహన డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతనిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత మానవత్వాన్ని మరిచిన విధంగా పరిసర ప్రాంత ప్రజలు ప్రవర్తించారు. డ్రైవర్‌ను కాపాడటంలో సహకరించాల్సిన సమయంలో, డీసీఎం లో పడిన కొబ్బరి బోండాలపై ఎగబడి వాటిని దోచుకెళ్లడం ప్రారంభించారు. ప్రమాదాన్ని చూసి చేరుకున్న కొందరు ప్రజలు గాయపడిన వ్యక్తిని చూసే పనికీ దూరంగా నిలిచి, తమకిష్టమైన కొబ్బరికాయలు మోసుకెళ్లడంలో నిమగ్నమయ్యారు.
ప్రజల ఈ తీరుపై అక్కడి సాక్షులు ఆవేదన వ్యక్తం చేశారు. “మనిషి ప్రాణం కన్నా కొబ్బరి బోండాలు విలువైనట్టయింది” అని విమర్శించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Post a Comment