జర్నలిస్టు సేవలు వెలకట్టలేనివి దిశ ఉమెన్ ప్రొటెక్షన్, ఫౌండర్ వాసర్ల నాగమణి
భద్రాద్రి కొత్తగూడెంజిల్లా జర్నలిస్టు లకు జర్నలిస్టు డే శుభాకాంక్షలు .
భద్రాద్రి కొత్తగూడెం: జర్నలిస్ట్ డే సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ ఉమెన్ ప్రొటెక్షన్ & వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు వాసర్ల నాగమణి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ మీడియా సంస్థలకు చెందిన విలేకరులను శాలువాలు కప్పి సన్మానించారు. జర్నలిస్టులు సామాజిక సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని ఆమె ప్రశంసించారు. మీడియా లేకుండా సమాజం ముందుకు సాగలేదని, ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని వాసర్ల నాగమణి పేర్కొన్నారు.
అంతేకాకుండా మహిళా రక్షణ, శ్రేయస్సు కోసం ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలను విలేకరులు సమాజానికి చేరవేయడంలో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ జిల్లా ప్రెసిడెంట్ మాధవి లత, వైస్ ప్రెసిడెంట్ బోగ లక్ష్మీ, అమీనా, స్థానిక ప్రతినిధులు, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Post a Comment