ప్రైవేటు దవాఖానలో దారుణం.. పేషంట్‌పై మేల్ నర్సు లైంగికదాడి!
కరీంనగర్ : కరీంనగర్ నగరంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కలకలం రేపిన సంఘటన చోటుచేసుకుంది. వైద్యం నిమిత్తం ఆసుపత్రికి చేరుకున్న యువతిపై మేల్ నర్సు లైంగిక దాడి చేశాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తీవ్ర జ్వరంతో బాధపడుతున్న బాధితురాలు తన తల్లితో కలిసి శనివారం రాత్రి నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి చేరుకుంది. ఎమర్జెన్సీ వార్డులో ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను బెడ్‌పై విశ్రాంతికి ఉంచగా, తల్లి మాత్రం వెయిటింగ్ హాల్‌లో నిద్రించారు. ఇదే సమయంలో మేల్ నర్సు, మత్తు ఇంజెక్షన్ ఇచ్చి యువతిపై అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది.
మత్తు తగ్గిన తరువాత అస్వస్థతగా అనిపించడంతో బాధితురాలు తల్లికి విషయం తెలిపింది. ఆపై తల్లి ఆసుపత్రి సిబ్బందిని నిలదీయగా, వెంటనే మూడవ పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
👉 కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, కరీంనగర్‌లో ఈ ఘటన కలకలం రేపింది.

Post a Comment