-->

జనగామ జిల్లా – స్టేషన్ ఘనపూర్‌లో గిరిజన విద్యార్థినుల ఆందోళన

జనగామ జిల్లా – స్టేషన్ ఘనపూర్‌లో గిరిజన విద్యార్థినుల ఆందోళన


జనగామ జిల్లా స్టేషన్‌ ఘనపూర్‌లో గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల నిరసన ఉద్రిక్తత రేపింది. తమకు బోధన చేస్తున్న ఉపాధ్యాయుడిని అక్రమంగా డిప్యూటేషన్ చేశారని ఆరోపిస్తూ విద్యార్థినులు శనివారం ఉదయం నుంచే ఆందోళన ప్రారంభించాయి.

ఉదయం 7 గంటల నుండి పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా నిరాహార దీక్ష చేపట్టిన విద్యార్థినులు “పై అధికారులు వచ్చేవరకు లేచేది లేదని” స్పష్టం చేశాయి. “తప్పు చేసిన వారిని ఇక్కడే ఉంచి, తప్పు చేయని మా సార్‌ను ఎందుకు పంపుతున్నారు?” అంటూ ప్రశ్నించాయి.

మా సార్‌ను తిరిగి పంపకపోతే ఇక్కడే మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని విద్యార్థినులు సంచలన హెచ్చరిక చేశారు. ఈ ఘటనతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పై అధికారులు వచ్చి సమస్య పరిష్కరించాలంటూ విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793