టెలిగ్రామ్ యాప్ క్లిక్‌తో రూ.1.25 లక్షలు మాయం!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అక్టోబర్ 08: పాల్వంచ మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన మాలోత్ పవన్ సైబర్ మోసగాళ్ల బారిన పడ్డాడు. తన మొబైల్‌ఫోన్‌లో టెలిగ్రామ్ యాప్ నోటిఫికేషన్ రావడంతో అనుమానాస్పద లింక్‌పై క్లిక్ చేశాడు. దాంతో మొదట రూ.40 వేలూ, తర్వాత మరోసారి రూ.20 వేలూ ఇలా దశల వారీగా మొత్తం రూ.1.25 లక్షలు అతని బ్యాంక్ ఖాతా నుంచి గల్లంతయ్యాయి.
ఈ విషయాన్ని గమనించిన పవన్ వెంటనే పాల్వంచ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఘటనపై సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. ప్రజలు ఇలాంటి అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయరాదని, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని పోలీసులు హెచ్చరించారు.
Post a Comment