-->

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం – ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం – ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు


జయశంకర్ భూపాలపల్లి జిల్లా, అక్టోబర్ 12: జిల్లా గణపురం మండలం చెల్పూర్ వద్ద 353వ జాతీయ రహదారిపై శనివారం భయానక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పరకాల–కాలేశ్వరం మార్గంలో వెళ్తున్న ఆటోను వెనుకనుంచి వచ్చిన బొలెరో వాహనం వేగంగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది.

ఘటనా స్థలంలో ఆటో తీవ్రంగా దెబ్బతినగా, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన డ్రైవర్‌ను జిల్లా వంద పడకల ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బొలెరో వాహనం వేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793