మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణతో సమస్య పరిష్కారం
హైదరాబాద్: అక్టోబర్ 08: మంత్రులు పొన్నం ప్రభాకర్ మరియు అడ్లూరి లక్ష్మణ్ మధ్య నెలకొన్న వివాదం పరిష్కారమైంది. ఈ ఉదయం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో ఇద్దరు మంత్రులు పాల్గొన్న బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మధ్యవర్తిత్వంతో ఇరువురి మధ్య చర్చలు సాగాయి.
సమావేశం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా తాను అడ్లూరి లక్ష్మణ్‌పై ఎలాంటి విమర్శనాత్మక వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. “అలాంటి మాటలు చెప్పే ఆలోచన నాకు లేదు. అలాంటి ఒరవడి లో నేనూ పెరగలేదు,” అని ఆయన అన్నారు.
కరీంనగర్‌లో మాదిగ సామాజిక వర్గంతో కలిసి తామంతా ఎదిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పత్రికల్లో వచ్చిన కథనాల వల్ల అడ్లూరి లక్ష్మణ్ బాధపడి ఉంటే దానికి తాను క్షమాపణలు కోరుతున్నానని పొన్నం ప్రభాకర్ తెలిపారు.
👉 దీంతో పీసీసీ చీఫ్ సర్దుబాటుతో ఇద్దరి మధ్య నెలకొన్న వివాదం తాత్కాలికంగా ముగిసినట్లైంది.
Post a Comment