-->

సర్వత్రా టెన్షన్ వాతావరణం.. BC రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా..

సర్వత్రా టెన్షన్ వాతావరణం.. BC రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా..


హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై నేడు హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, దీనిపై దాఖలైన పిటిషన్‌లను హైకోర్టు విచారించింది. ఉదయం 10.30 గంటలకు విచారణ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, న్యాయవాదులు బీసీ రిజర్వేషన్ పిటిషన్‌ను మెన్షన్ చేశారు.

సుప్రీంకోర్టులో ఈ అంశంపై ఏం జరిగిందని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించగా, సంబంధిత వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని వాదనలు వినిపించారు. దీంతో హైకోర్టు విచారణను మధ్యాహ్నం 12.30కి వాయిదా వేసింది.

ఇక ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం మంత్రులు, న్యాయ నిపుణులతో కీలక చర్చలు జరిపారు. ఈ కేసు తీర్పు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై ప్రభావం చూపే అవకాశముందని భావిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793