-->

15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన TGSPDCL సబ్ ఇంజనీరు

15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన TGSPDCL సబ్ ఇంజనీరు


హైదరాబాద్, అక్టోబర్ 10: సికింద్రాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో లంచం కేసును బయటపెట్టారు. TGSPDCL పద్మారావు నగర్ సబ్‌డివిజన్ పరిధిలోని లాలగూడ సెక్షన్ సబ్ ఇంజనీరు & ఇన్‌చార్జి సహాయక ఇంజనీరు భూమిరెడ్డి సుధాకర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఎసిబి అధికారుల చెరలో చిక్కారు.

వివరాల ప్రకారం — ఫిర్యాదుదారుడు చేపట్టిన విద్యుత్ కాంట్రాక్ట్ పనికి సంబంధించిన స్థలంలో సింగిల్ ఫేజ్ మీటర్లను త్రీ ఫేజ్ మీటర్లకు ఆధునికీకరించడం కోసం సంబంధిత దస్తావేజులను ప్రాసెస్ చేయడంతో పాటు 63 KVA ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు అంచనా ప్రతిని సిద్ధం చేయడానికి భూమిరెడ్డి సుధాకర్ రెడ్డి రూ.15,000 లంచం కోరినట్లు తెలుస్తోంది.

ఫిర్యాదుదారు ఈ విషయాన్ని తెలంగాణ అవినీతి నిరోధకశాఖకు (ACB) సమాచారం అందించడంతో, అధికారులు ఏర్పాటుచేసిన ఉచ్చులో సుధాకర్ రెడ్డి చిక్కాడు. ఎసిబి అధికారులు నిందితుడిపై కేసు నమోదు చేసి, విచారణ కొనసాగిస్తున్నారు.

🔹 ప్రజలకు ఎసిబి విజ్ఞప్తి:
ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినట్లయితే వెంటనే తెలంగాణ అవినీతి నిరోధకశాఖ (ACB)ని సంప్రదించవచ్చు.

📞 టోల్ ఫ్రీ నంబర్: 1064
📱 వాట్సాప్: 9440446106
🌐 వెబ్‌సైట్: acb.telangana.gov.in
📘 ఫేస్‌బుక్: Telangana ACB
𝕏 ఎక్స్ (ట్విట్టర్): @TelanganaACB

ఎసిబి హామీ: ఫిర్యాదుదారుల / బాధితుల వివరాలు పూర్తి గోప్యంగా ఉంచబడతాయి.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793