ఎల్‌బీ నగర్ బీసీ నాయకుడు రామ్ కోటి జాగృతిలో చేరిక
హైదరాబాద్, అక్టోబర్ 10 : ఎల్‌బీ నగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్‌కు చెందిన ప్రముఖ బీసీ నాయకుడు రామ్ కోటి శుక్రవారం తెలంగాణ జాగృతిలో చేరారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి సమక్షంలో రామ్ కోటి తో పాటు 350 మందికి పైగా జాగృతిలో చేరారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ,“జాగృతిలో చేరడమంటే బతుకమ్మ ఆడినట్లు ఉంటుంది. బతుకమ్మలో పూలను ఎత్తినంత ఉత్సాహంతో, పిడికిలెత్తి పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది,” అని తెలిపారు.
ఆమె మరింతగా మాట్లాడుతూ..
- “ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు నెలకు రూ.2500 ఇస్తామని చెప్పి మోసం చేసింది. దానికి వ్యతిరేకంగా మనం కొట్లాడాలి.”
- “ప్రసవం కోసం ఆస్పత్రులకు వెళ్లిన మహిళలకు గతంలో కేసీఆర్ కిట్ వచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దానిని నిలిపివేసింది. అడబిడ్డలకు కిట్‌ల సాధన కోసం మనం పోరాటం చేయాలి.”
- “పేదింటి బిడ్డ పెళ్లికి తులం బంగారం ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఆ హామీ కోసం కూడా మనం కొట్లాడాలి.”
- “ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. యువత భవిష్యత్తు కోసం మనం పోరాడాలి.”
- “ప్రత్యేక బీసీ బిల్లు తెస్తామని చెప్పి ఇప్పటివరకు ఏమీ చేయలేదు. బీసీ సమాజం హక్కుల కోసం మనం ఒక తాటిపై నిలబడి పోరాటం కొనసాగించాలి.”
కవిత గారు చివరగా పేర్కొంటూ—“జాగృతి అంటేనే పోరాటాల జెండా, జాగృతి అంటేనే విప్లవాల జెండా. ఒక్కటి కాదు, అన్ని అంశాలపైనా ఈ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిద్దాం,” అని పిలుపునిచ్చారు.
Post a Comment