-->

మేడారంలో సరికొత్త సదుపాయం వనదేవతలకు డిజిటల్ హుండీ

 

మేడారంలో సరికొత్త సదుపాయం వనదేవతలకు డిజిటల్ హుండీ

 భక్తుల సౌలభ్యం కోసం అధికారులు ముందడుగు

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లకు ఇప్పుడు డిజిటల్ పద్ధతిలో కానుకలు సమర్పించే సౌకర్యం లభించింది. భక్తులు ఇకపై ఆన్లైన్ చెల్లింపుల ద్వారా తమ భక్తి నైవేద్యాన్ని సమర్పించవచ్చు.

దర్శనం అనంతరం నోట్ల కొరత కారణంగా కానుకలు సమర్పించడంలో ఇబ్బంది పడుతున్న భక్తుల సమస్యను అధికారులు గమనించారు. ఈ నేపథ్యంలో తాడ్వాయి కెనరా బ్యాంకు యంత్రాంగంతో సమన్వయం చేసి QR కోడ్ స్కానర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

భక్తులు స్కాన్ చేసి డిజిటల్ పేమెంట్ చేయగలిగే విధంగా మేడారం ప్రాంగణంలో ఈ సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ డిజిటల్ హుండీ వ్యవస్థను మేడారం ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య శనివారం ఆవిష్కరించారు. అధికారులు, బ్యాంకు ప్రతినిధులు, స్థానిక భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సదుపాయం ప్రారంభం కావడంతో భక్తులు నగదు అవసరం లేకుండానే సులభంగా అమ్మవార్లకు తమ భక్తిని సమర్పించగలుగుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793