లైవ్‌లో ఫినైల్ తాగిన 25 మంది ట్రాన్స్‌జెండర్లు!
ఇండోర్ (మధ్యప్రదేశ్): ఇండోర్ నగరంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఘటన స్థానికులను కలవరపరిచింది. నందలాల్‌పురా ప్రాంతంలో నివసిస్తున్న సుమారు 25 మంది ట్రాన్స్‌జెండర్లు ఒకే గదిలో సామూహికంగా ఫినైల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన లైవ్‌లో ప్రసారం అయ్యిందన్న సమాచారం కూడా వెలువడింది.
పంధారినాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకోగా, ఒక ట్రాన్స్‌జెండర్ ఫినైల్ తాగినట్లు పోలీసులకు సమాచారం అందడంతో, అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. తలుపు తెరిచి చూసేసరికి గదిలో 25 మంది ట్రాన్స్‌జెండర్లు అపస్మారక స్థితిలో పడ్డారు. వారందరినీ మహారాజా యశ్వంతరావ్ హాస్పిటల్ (MYH) కు తరలించి చికిత్స అందించారు.
వైద్యుల ప్రకారం, ప్రారంభ చికిత్స అనంతరం అందరి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని, ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ బసంత్‌కుమార్ నింగ్వాల్ మాట్లాడుతూ, “వీరందరూ చికిత్స పొందుతున్నారు. ఎవరి పరిస్థితి కూడా ప్రమాదకరం కాదు,” అని చెప్పారు.
ఈ సంఘటన వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదు. సామాజిక సమస్యలు లేదా వ్యక్తిగత విభేదాలు ఉన్నాయేమో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఒకే సమయంలో 25 మంది ఫినైల్ తాగడం ఇండోర్‌లో సంచలనం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.
Post a Comment