-->

కొత్తపల్లిలో దారుణం..! బాలికపై లైంగిక దాడి – వీడియో వైరల్‌

కొత్తపల్లిలో దారుణం..! బాలికపై లైంగిక దాడి – వీడియో వైరల్‌


కొత్తపల్లి, అక్టోబర్‌ 13: కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలంలో సంచలనకర ఘటన చోటుచేసుకుంది. ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడి, దానిని వీడియో తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ప్రాంతంలో కలకలం రేగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం — కొత్తపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికతో ఇద్దరు యువకులు కొద్దికాలంగా పరిచయం పెంచుకున్నారు. ఆ క్రమంలో ఆమెకు మత్తు పదార్థాల అలవాటు కూడా చేయించినట్లు సమాచారం. వారం రోజుల క్రితం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, ఒకరి తరువాత ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరించి, మూడు రోజుల క్రితం స్థానిక వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టు చేశారు.

వీడియోలు వైరల్‌ కావడంతో బాలిక తల్లిదండ్రుల దృష్టికి వెళ్లి, ఆగ్రహంతో కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ విజయ్‌కుమార్‌ ఆదేశాల మేరకు సీఐ బిల్లా కోటేశ్వర్‌ సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టి, నిందితులు విశ్వతేజ్‌, సన్నీపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఇద్దరినీ అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇటీవలే అదే గ్రామంలో పోలీసులు “మత్తుకు బానిసలవద్దు” అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమం జరిగిన కొద్దిరోజులకే ఈ దారుణం జరగడం స్థానికులను కలవరపరిచింది. గ్రామంలో మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో విచారణ జరిపి వాటిని అరికట్టాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793