-->

పోలీస్ సిబ్బందికి కిట్ ఆర్టికల్స్ పంపిణీ చేసిన సీపీ

పోలీస్ సిబ్బందికి కిట్ ఆర్టికల్స్ పంపిణీ చేసిన సీపీ


రామగుండం, అక్టోబర్ 13, 2025: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సోమవారం పోలీస్ సిబ్బందికి కిట్ ఆర్టికల్స్ పంపిణీ చేశారు. చలి, వర్ష కాలంలో విధులు నిర్వర్తించే సిబ్బందికి సౌకర్యంగా ఉండేందుకు ఈ చర్య తీసుకున్నారు.

ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ — క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే పోలీస్ సిబ్బంది సంక్షేమమే తమకు ముఖ్యమని తెలిపారు. వాతావరణ మార్పులు, కఠిన విధుల నేపథ్యంలో సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉన్ని దుప్పట్లు, వూలెన్ జాకెట్లు, కాటన్ టీ-షర్టులు, రెయిన్‌కోట్లు, అలాగే స్పెషల్ పార్టీ సిబ్బందికి వాటర్‌ప్రూఫ్ హవర్ సాక్స్ అందజేశామని పేర్కొన్నారు.

ప్రతి పోలీస్ ఉద్యోగి తన వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని సీపీ సూచించారు. విధుల్లో నిబద్ధతతో పాటు ఆరోగ్య రక్షణకూ ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793