-->

మంథనిలో రూ.40 కోట్లతో ఏటీసీ సెంటర్ ఏర్పాటు: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

 

మంథనిలో రూ.40 కోట్లతో ఏటీసీ సెంటర్ ఏర్పాటు: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

పుట్టపాకలో శ్రీపాద స్మారక బస్ షెల్టర్ ప్రారంభం

పెద్దపల్లి, అక్టోబర్ 13: గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు మంథనిలో రూ.40 కోట్ల వ్యయంతో అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ)ను ఏర్పాటు చేయనున్నామని ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.

సోమవారం సాయంత్రం మంథని మండలం పుట్టపాక గ్రామంలో మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు స్మారక బస్ షెల్టర్‌ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ బస్ షెల్టర్‌ను సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్–రమాదేవి దంపతులు తమ స్వంత నిధులతో నిర్మించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ—

“మంథనిలో ఏర్పడబోయే అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా నిరుద్యోగ యువతకు శిక్షణతో పాటు ఉపాధి లభిస్తుంది. అక్కడ చదువుకునే విద్యార్థులకు నెలకు రూ.2,000 స్టైఫెండ్ అందిస్తాం. గ్రామీణ యువత అభివృద్ధి కోసం అనేక పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతున్నాం,” అని అన్నారు.

పుట్టపాకలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే సిమెంట్ రోడ్లు, చేతి పంపులు, తాగునీటి నల్లాలు ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. పుట్టపాక నుండి మహబూబ్‌పల్లి వరకు బీటీ రోడ్డును కూడా ఆ కాలంలోనే నిర్మించామని తెలిపారు.

మంత్రి పుట్టపాకకు రాగానే స్థానికులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఏఏంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, టీజిఈఆర్సీ సలహాదారు శశిభూషణ్ కాచే, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్, మాజీ ఏఏంసీ చైర్మన్ ఆజీం ఖాన్, మాజీ ఎంపీపీ కొండ శంకర్, సింగిల్ విండో డైరెక్టర్లు కొత్త శ్రీనివాస్, పెద్దిరాజు ప్రభాకర్, రావికోటి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే కమాన్‌పూర్ ఏఏంసీ చైర్మన్ వైనాల రాజు, నాయకులు పేరవేన లింగయ్య, శ్రీరాంబట్ల శ్రీనివాస్, శ్రీపతి బానయ్య, జనగామ నర్సింగరావు, సేగ్గం రాజేష్, వోడ్నాల శ్రీనివాస్, సాధుల శ్రీకాంత్, చాట్లపల్లి సంతోష్, ఎడ్ల శ్రావణ్, కన్నూరి సుదర్శన్, సవాయి గణేష్, అయిలి శ్రీనివాస్, హుసేన్ భీ, ఆరేల్లి కిరణ్ గౌడ్, రేపాక శ్రీకాంత్, అలాగే అధికారుల్లో ఆర్డీవో సురేష్, ఎమ్మార్వో, ఆర్టీసీ డీఎం తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793