అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల సంయుక్తంగా “హనోరిస్ కాజా డాక్టరేట్ అవార్డు – 2025” ప్రదానం
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 12 : అమెరికా, ఇటలీ, గ్రీస్ దేశాలకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా “హనోరిస్ కాజా డాక్టరేట్ అవార్డు – 2025”ను ప్రదానం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఈ ప్రతిష్ఠాత్మక బహుమతిని అక్టోబర్ 12న న్యూ ఢిల్లీలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ మిలీనియం MJF Ln.j.b.Mohan కు ప్రదానం చేశారు.
ఈ అవార్డును Maryland State University (USA), University of Cuneo (Italy), Burlington State University (USA) మరియు Chania International University (Greece) సంయుక్తంగా ప్రదానం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులను గౌరవించడానికి ఈ అవార్డు ప్రతి సంవత్సరం అందజేయబడుతుంది.
“Honoris Causa Doctorate” అంటే గౌరవ డాక్టరేట్ బిరుదు. ఇది సాధారణంగా విశ్వవిద్యాలయం అకాడమిక్ ప్రమాణాలకన్నా వ్యక్తి సమాజానికి, విజ్ఞానానికి, కళలకు లేదా సేవా రంగాలకు చేసిన కృషిని గుర్తించి ఇచ్చే ప్రత్యేక గౌరవం.
ఈ ఏడాది అవార్డు కార్యక్రమానికి భారతదేశం ఆతిథ్యమివ్వడం విశేషం. ప్రపంచ దేశాల విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, సామాజికవేత్తలు, వ్యాపారవేత్తలు, మరియు సాంస్కృతిక రంగ ప్రతినిధులు హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు మాట్లాడుతూ, “భారతదేశం విద్యా, సాంకేతిక రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. అందుకే ఈ ఏడాది గౌరవ డాక్టరేట్ అవార్డు కార్యక్రమాన్ని న్యూ ఢిల్లీలో నిర్వహించాం” అని తెలిపారు.
ఈ సందర్భంగా పలు భారతీయ ప్రముఖులు కూడా గౌరవించబడ్డారని, వారు దేశ ప్రతిష్ఠను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టారని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ అవార్డు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావుల కృషిని గుర్తించి ప్రోత్సహించే అంతర్జాతీయ గౌరవంగా భావిస్తున్నారు.
Post a Comment