ఎర్రగడ్డలో రూ.70 వేల నగదు స్వాధీనం సనత్‌నగర్ పోలీసులు
అమీర్‌పేట్, అక్టోబర్ 15: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపధ్యంలో పోలీసులు తనిఖీలు కఠినతరం చేశారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి సనత్‌నగర్ పోలీసులు ఎర్రగడ్డ వద్ద భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. బోరబండకు చెందిన సుభాష్ పాటిల్ అనే వ్యక్తి రూ.70 వేల నగదుతో ఎర్రగడ్డ మీదుగా మోతీనగర్ వైపు వెళ్తుండగా బ్రిగేడ్ సిటడెల్ ఎదురుగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
పోలీసుల అనుమానం రావడంతో అతనిని ఆపి తనిఖీ చేసినప్పుడు రూ.70 వేల నగదు బయటపడింది. నగదు మూలం గురించి సుభాష్ పాటిల్ స్పష్టమైన వివరణ ఇవ్వలేకపోవడంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించామని సనత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ కె. శ్రీనివాసులు తెలిపారు.
ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమ నగదు చలామణి జరగకుండా చర్యలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
Post a Comment