చిరుత పులి గోర్లు తస్కరించిన వ్యక్తికి మూడు సంవత్సరాల జైలు శిక్ష
కొత్తగూడెం, లీగల్: చనిపోయిన చిరుత పులి గోర్లు అక్రమంగా తస్కరించిన కేసులో నిందితుడికి మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.25 వేల జరిమానా విధిస్తూ, కొత్తగూడెం మొదటి అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కె. సాయి శ్రీ సోమవారం తీర్పు ప్రకటించారు.
దీంతో రామవరం రేంజ్ ఆఫీసర్ జి. మధుసూదన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో ముద్దాయిలు రెండు మేకలు కనిపించకపోవడంతో, చిరుతలు వాటిని చంపేశాయని భావించి, మోనోక్రోటోఫాస్ అనే విషాన్ని మేకలపై ఉపయోగించినట్లు బయటపడింది. ఆ మేకలను తిన్న రెండు చిరుత పులులు మృతిచెందాయి.
తదుపరి విచారణలో మొదటి చిరుత పులి గోర్లు మరకల లక్ష్మారెడ్డి వద్ద నుండి రికవరీ అయ్యాయి. ఈ కేసులో అబ్బుగూడెం గ్రామానికి చెందిన భూష సత్యం, పోతిని మంగయ్య, బుస హనుమంతరావు, కర్రీ ఆశయ, మరకల లక్ష్మారెడ్డి, మిడియా లక్ష్మయ్యలపై చార్జ్‌షీట్ దాఖలైంది. విచారణలో మిడియా లక్ష్మయ్య మరణించగా, మిగతా ఐదుగురిపై నేరం రుజువు కాలేదు.
అయితే మరకల లక్ష్మారెడ్డి నేరం చేసినట్లు తేలడంతో, ఆయనకు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.25 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కె. సాయి శ్రీ తీర్పు వెలువరించారు.
కేసులో ప్రాసిక్యూషన్ తరఫున నాగలక్ష్మి, విశ్వశాంతి వాదనలు వినిపించగా, కోర్టు నోడల్ ఆఫీసర్ ఎస్.ఐ. ఆర్. ప్రభాకర్, లైజాన్ ఆఫీసర్ శ్రీనివాస్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కల్పనాలు సహకరించారు.
Post a Comment