-->

కలెక్టరేట్‌లో మహిళా సిబ్బందిపై అత్యాచారయత్నం సంచలనం

కలెక్టరేట్‌లో మహిళా సిబ్బందిపై అత్యాచారయత్నం సంచలనం


హన్మకొండ, అక్టోబర్ 13: హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. అదే కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా సిబ్బందిపై సీనియర్ అసిస్టెంట్ అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.

వివరాల ప్రకారం — కలెక్టరేట్‌లోని ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఇర్ఫాన్ సోహెల్, తనతో పనిచేస్తున్న మహిళా సహోద్యోగిపై లైంగిక దాడి ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. నిందితుడి బారిన పడకుండా తప్పించుకున్న బాధితురాలు వెంటనే సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇందులో లైంగిక వేధింపులు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నిబంధనలను అమలు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, కలెక్టర్ వెంటనే నిందితుడు ఇర్ఫాన్ సోహెల్‌ను సస్పెండ్ చేశారు.

కలెక్టరేట్ వంటి ప్రభుత్వ కార్యాలయంలోనే ఈ ఘటన జరగడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితుడికి పైస్థాయి అధికారుల అండ ఉందని కొంతమంది ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793