ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై అధికారుల కొరడా
పెద్దపల్లి జిల్లా, అక్టోబర్ 31: మంథని పట్టణ పరిధిలో ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు శుక్రవారం ఉదయం కొరడా ఝళిపించారు.
మంథని మున్సిపల్ పరిధిలోని గంగపురి నాలుగో వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ కుర్ర లింగయ్య బొక్కల వాగు సమీపంలో నిర్మించిన ఇంటిని అధికారులు జెసిబి యంత్రాలతో కూల్చివేశారు.
కూల్చివేతను ఆపేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మంథని పోలీస్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన పహారాలో మున్సిపల్ సిబ్బంది ఆక్రమణలను తొలగించారు.

Post a Comment